News

టీఆర్ఎస్ ఎంపి బాల్క సుమన్‌పై ఫిర్యాదు


టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ పై జనసేన పార్టీ కార్యకర్తలు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సుమన్ స్పందిస్తూ పవన్ కళ్యాణా..ప్యాకేజీ కళ్యాణా అని విమర్శించిన సంగతి తెలిసిందే..పవన్ ను ప్యాకేజీ కళ్యాణ్ గా విమర్శించి , ప్రతిష్ట దిగజార్చేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన ఫిర్యాదును జూబ్లిహిల్స్ పోలీసులు స్వీకరించారు. అయితే పవన్ కళ్యాణ్ సీమాంధ్ర ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసారని ఎపిలోనూ పలుచోట్లు ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే..మరి ఇటువంటి ఫిర్యాదులపై పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..